Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుసగా 13వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol diesel prices go up for the 13th straight day
  • పెట్రోలుపై లీటరుకు 56 పైసలు పెరుగుదల
  • డీజిల్‌పై లీటరుకు 63 పైసల పెంపు
  • 13 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.11 పెరుగుదల
  • డీజిల్‌ ధర రూ.7.67 పెంపు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 13వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 56 పైసలు, డీజిల్‌పై లీటరుకు 63 పైసలు పెరిగాయి. 13 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.11, డీజిల్‌ ధర రూ.7.67 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.78.37కి, డీజిల్ ధర రూ. 77.06కి చేరింది.

ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.85.21కి, డీజిల్‌ 75.53కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.82, డీజిల్ ధర రూ.74.77గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.80.13, డీజిల్ ధర రూ.72.53గా ఉంది.
Petrol
diesel
India

More Telugu News